30. నవవిధ సంస్కార నిరూపణము

ద్వావింశతి వర్ణకము
30. నవవిధ సంస్కార నిరూపణము

            నవవిధ సంస్కారంబులను నిరూపించుచున్నారము. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయంబులనియు, కర్తృ కర్మ క్రియలనియు, భోక్తృ భోజ్య భోగంబులనియు సంస్కారంబులు తొమ్మిది విధంబులు. పక్షాంతరంబున ప్రాణ పంచకంబును జ్ఞానేంద్రియంబులును కర్మేంద్రియంబులును భూతపంచకంబును అంతఃకరణ చతుష్టయంబును స్థూలశరీరంబును త్రివిధ కర్మంబులును అవస్థా త్రయంబును వీనికి కారణమయిన అజ్ఞానంబును గూడి నవవిధ సంస్కా రంబు లని చెప్పఁబడెను. దీనికి నవవిధ ప్రపంచమనియు పేరు. ఈ నవవిధ సంస్కారంబులును అహంకారంబునకే కాని, అహంకార సాక్షినైన నాకు లేవని యెవఁడెఱుఁగుచున్నాఁడో వాఁడే ముక్తుఁడని వేదాంత సిద్ధాంతము.

ఇది ద్వావింశతి వర్ణకము.